సమాజానికి ధర్మమార్గాన్ని చూపిన మహానీయుడు గౌతమ బుద్ధుడు
- A Hero’s Journey to Conquer New Horizons - May 23, 2025
- Playing It Safe: Tips and Tricks for Shaolin Soccer - May 23, 2025
- Uncovering the Mystery of 3 Carts of Gold’s Bonus System - May 23, 2025

సమాజానికి ధర్మమార్గాన్ని చూపిన మహానీయుడు గౌతమ బుద్ధుడు
- TS AYS రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య
- గౌతమ బుద్ధుని 2568వ ఘనంగా జయంతి వేడుకలు
జ్ఞానతెలంగాణ, చిట్యాల మే 23:
గౌతమా బుద్ధుడు బోధిసత్వుడిగా జన్మించి సమాజానికి ధర్మమార్గాన్ని చూపి గొప్ప గురువు అయ్యారని, దేశంలోని ప్రజలు మహిళలు సమానత్వం తో కలిసి ఉండాలని గౌరవం తో జీవించుటకు వారిని చైతన్య వంతులను చేయాలని ఎంతో క్రృషి చేశారని తెలంగాణా రాష్ట్ర అంబెడ్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య అన్నారు. గురువారం రోజున జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ రాష్ట్ర అంబెడ్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు సరిగొమ్ముల రాజేందర్ అద్యక్షతన గౌతమా బుద్ధుని 2568 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ . జీవకోటికి ప్రేమ తత్వాన్ని బోధనలు చేసి, సంపాదన, జీవితం శాశ్వతం కాదు మంచితనం ఒక్కటే శాశ్వతంగా నిలుస్తుందన్నారు. బాల్యం లోనే బాణం దెబ్బ కు విలవిల లాడిన పావురం ను కాపాడినాడని తెలిపారు రెండు రాజ్యాల మధ్య నదీజలాల వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించాడన్నారు. తాను జ్ణానం పొందిన బోది వ్రృక్షం పేరు వచ్చేలా స్థిర పడినాడని తెలిపారు. తనను ధిక్కరించి వెళ్లిన వారినే తన బోధనల ద్వారా శిష్యులుగా చేసుకున్నారని చెప్పారు. ఆనాటి విశ్వ సుందరి, రాజు నర్తకి గణిక వ్రృత్తిలో వున్న“అమ్రపాలి’నిని బౌద్ద బిక్షుణిగా మార్చి నాడని తెలిపారు. త్రిరత్నాలను, పంచశీల ను , అష్టాంగ మార్గంను బోధీంచినాడని , కులాన్ని వర్ణాశ్రమ ధర్మాలను నిరశించటమే కాక అన్ని కులాల వారిని తన అనుచరులుగా చేసుకుంటున్నాడని చెప్పారు. బౌద్ద దీక్షలో ముందుగా ఏ కులము వారైనా తరువాత వచ్చిన వారు గౌరవించే గురు సంప్రదాయాన్ని ఏర్పాటు చేసినాడని అన్నారు . బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం రచనకు ప్రేరణ అయిన స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వాలనుఅందించడాని తెలిపారు పూర్వజన్మ పునర్జన్మ లను వర్ణాశ్రమ ధర్మాలను బలపరిచే కర్మ సిద్ధాంతాలను నమ్మవద్దని చెప్పారన్నారు. తన జీవిత మంతా వనాలలో,ప్రజల మధ్య బోధనలు చేస్తూ గడిపేవాడిని అన్నారు . దేవుడు లేడని స్వయం శక్తి పై నమ్మకం ఉంచాలని తెలిపారు. సత్య నిరూపణ కోసం ఎవరినైనా దిక్కరించమన్నది, తాను చెప్పిన దానిని కూడా తప్పని భావిస్తే తిరస్కరించమని ప్రతి దానిని నిరూపణ చేసుకోకుండా ఆచరించ వద్దనీ చెప్పారన్నారు. ఇలాంటివి ఇంకా ఎన్నో చెప్పారని, 84 వేల ప్రవచనాలు చేసిన మహనీయుడు గౌతమ బుద్ధుడు అని తెలిపారు. ఈ మహానీయుడు దేశానికి ప్రజలకు చేసిన సేవలు మరువలేనివని ,ఆయన ఆశయాలు, సిద్ధాంతాలు కొనసాగించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు సరిగొమ్ముల రాజేందర్ ఉపాధ్యక్షుడు కట్కూరి శ్రీనివాస్ నాయకులు మైదం మహేశ్ కట్కూరి మొగిలి గడ్డం సదానందం రాజమౌళి సంద్య ప్రతాప్ చందర్ తదితరులు పాల్గొన్నారు.
