రిపోర్టర్, సంగారెడ్డి | 9000600737
Latest posts by MOHAMMAD MOHAMMAD
(see all) ఝరాసంగం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం పార్వతీ సంగమేశ్వరుల కల్యాణాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో పార్వతీ సంగమేశ్వరుల ఉత్సవమూర్తులకు ఆలయ అర్చకులు వేదమంత్రాలతో కల్యాణం జరిపించారు. కల్యాణోత్సవంలో జహీరాబాద్ ఎంపీ సురేష్కుమార్ షెట్కార్ పాల్గొన్నారు. సాయంత్రం ఆలయం వెనుక ఉన్న అమృతగుండంలో దీపారాధన నిర్వహించారు. అదే విధంగా ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు పాల్గొన్నారు. ముందుగా ఆలయ అర్చకులు రాజగోపురం ముందు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యేను ఈవో శివరుద్రప్ప, ఆలయ చైర్మన్ చంద్రశేఖర్ పూలమాల, శాలువాతో సన్మానించారు. అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి చైర్మన్ చంద్రశేఖర్, ఆలయ ఈఓ శివరుద్రప్ప, మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు హన్మంత్ రావు పాటిల్, ఆయా గ్రామాల టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ధర్మకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
