ముదిరాజుల ఐక్యతతోనే హక్కులు సాధ్యం:నూకం వెంకటయ్య
- ప్రమాదంలో గాయపడిన లాలూ నాయక్‌కు భూపతిరెడ్డి పరామర్శ - November 21, 2026
- ముదిరాజుల ఐక్యతతోనే హక్కులు సాధ్యం:నూకం వెంకటయ్య - November 21, 2026
- చెదురుపల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం - November 21, 2026

వెల్దండ నవంబర్ 21:మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలవాలని జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు నూకం వెంకటయ్య ముదిరాజ్ కోరారు.ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా శుక్రవారం వెల్దండ ముదిరాజ్ సంఘం వద్ద జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమానికి చెరువుల అభివృద్ధి, చేప పిల్లల పంపిణీ, బీమా, రాయితీలు కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యకార సొసైటీ డైరెక్టర్ క్యాసరపు వెంకటయ్య ముదిరాజ్, మండల సంఘం అధ్యక్షుడు మల్లయ్య, ఉపసర్పంచ్ బస్నమోని శ్రీనివాస్, బస్నమోని లింగం, బయ్య మల్లయ్య, కృష్ణ ముదిరాజ్, మాసుల బాలరాజు, దేవేందర్, మారేపల్లి శ్రీనివాస్, మోరా శ్రీను, రామకృష్ణ, పిల్లి శ్రీను, బయ్య లక్ష్మయ్య, నవీన్ కుమార్, మత్స్యకార సొసైటీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
