జనగామ మున్సిపల్ చైర్‌పర్సన్ బాలమణి శ్రీనివాస్‌ను కలిసిన కాంగ్రెస్ సేవాదళ్ నాయకులు
- విద్యార్థులకు చట్టాలపై అవగాహన అవసరం – అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె. సందీప - November 21, 2026
- జనగామలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి విశేష స్పందన - November 21, 2026
- రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జనగామలో భారీ బైక్ ర్యాలీ నిర్వహణకు నిర్ణయం - November 21, 2026

జనగామ మున్సిపల్ చైర్‌పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్‌ను కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు జాయ మల్లేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ సేవాదళ్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.ఇటీవల కాంగ్రెస్ సేవాదళ్ జనగామ పట్టణ అధ్యక్షుడిగా ఎన్నికైన కౌడే శ్రీనివాస్ ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, సేవాదళ్ ఆశయాలకు అనుగుణంగా ప్రజాసేవలో చురుకుగా పాల్గొంటామని, పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు దోర్నాల వెంకటేశ్వర్లు, సేవాదళ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పలయ్య, జిల్లా కార్యదర్శి మొటే మల్లేశం, ఒగ్గు కళాకారుల సంఘం జిల్లా నాయకుడు బర్ల అనిల్ కుమార్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
