AISA రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలి – విద్యార్థులకు నాయకుల పిలుపు

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో AISA రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ AISA నాయకులు కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రాష్ట్ర మహాసభల ప్రాధాన్యతను వివరించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యార్థులు ఎదుర్కొంటున్న విద్యా సమస్యలు, అధిక ఫీజుల భారం, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర మహాసభల్లో విద్యార్థుల సమస్యలపై సమగ్రంగా చర్చించి, వాటి పరిష్కారం కోసం భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు.
విద్యార్థుల హక్కుల సాధన కోసం జరిగే AISA రాష్ట్ర మహాసభలను విజయవంతం చేసేందుకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో AISA పట్టణ అధ్యక్షుడు రాజు, పట్టణ కార్యదర్శి శ్యామ్‌తో పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.

You may also like...