ఆహార శుద్ధి కర్మాగారానికి భూమిపూజ.. ముఖ్యఅతిథిగా గవర్నర్ ఇంద్రసేనారెడ్డి
- ఆహార శుద్ధి కర్మాగారానికి భూమిపూజ.. ముఖ్యఅతిథిగా గవర్నర్ ఇంద్రసేనారెడ్డి - November 20, 2026
- పలు శుభకార్యాలలో పాల్గొన్న ప్రముఖ సంఘ సేవకులు పాపిశెట్టి రామన్న - November 20, 2026
- నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా.. వెల్దండలో ఇందిరమ్మ జీవిత బీమా పథకం ప్రారంభం - November 20, 2026

తలకొండపల్లి,నవంబర్ 20: మండలంలోని వెంకటాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని పడకల్ గేట్ వద్ద మహీధర రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఆధ్వర్యంలో నిర్మించనున్న ఆహార శుద్ధి కర్మాగార భవన సముదాయానికి శుక్రవారం భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీజేపీ జాతీయ నేత తల్లోజు ఆచారితో కలిసి పలువురు నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్కు వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందజేశారు. రైతుల ఉత్పత్తులకు విలువ జోడించి, ఆహార శుద్ధి పరిశ్రమల ద్వారా రైతులకు ఉపాధి, ఆర్థిక ప్రయోజనాలు కల్పించవచ్చని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
