యాసీన్ ప్రైమ్ హాస్పిటల్‌ను ప్రారంభించిన పరిగి ఎమ్మెల్యే TRR
- యాసీన్ ప్రైమ్ హాస్పిటల్‌ను ప్రారంభించిన పరిగి ఎమ్మెల్యే TRR - November 19, 2026
- పరిగి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, స్టేషన్ నిర్వహణ, కేసుల దర్యాప్తుపై సమీక్ష నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్ర - November 19, 2026
- విద్యార్థులకు గుర్తింపు కార్డులు అందజేసిన పాఠశాల ఉపాధ్యాయులు,స్వేరోస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్నాపూర్ శ్రీనివాస్ - November 19, 2026
పరిగి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన యాసీన్ ప్రైమ్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ (SIR) డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఆసుపత్రిని ప్రారంభించి, ఆసుపత్రి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆసుపత్రి యాజమాన్యం ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించి, కార్యక్రమానికి హాజరైనందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,స్థానిక కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
