వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠా అరెస్ట్

WhatsApp Image 2026-11-18 at 20.29.25.jpeg

జనగామ జిల్లాలోని రఘునాథపల్లి మండలంతో పాటు పలు గ్రామాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.20.50 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలతో పాటు మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.రఘునాథపల్లి మండలానికి చెందిన కడుదుల అరవింద్, గుడెల్లి రంజిత్, లింగాల ఘణపురం మండలం కిష్టగూడెం గ్రామానికి చెందిన ఐలేని అచ్యుత్ రెడ్డి స్నేహితులు. వీరు రాత్రి వేళల్లో తాళాలు వేసిన ఇళ్లను గుర్తించి చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. కుర్మగూడెం, భాంజీపేట, శివాజీనగర్, రఘునాథపల్లి, కాంచనపల్లి, ధర్మసాగర్ మండలం కరుణాపురంలో దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.ఈనెల 18న కోమళ్ల టోల్‌గేట్ వద్ద వాహన తనిఖీల సందర్భంగా అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలు అంగీకరించారు. వారి నుంచి 11.315 తులాల బంగారం, 2.309 కిలోల వెండి, హీరో గ్లామర్, హీరో ప్యాషన్ ప్రో, కేటీఎం డ్యూక్ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ సూచనలతో స్టేషన్ ఘన్‌పూర్ ఏసీపీ భీమా శర్మ ఆధ్వర్యంలో సీఐ జి.వేణు పర్యవేక్షణలో ఎస్‌హెచ్‌ఓ ఎం.భారత్, సిబ్బంది కేసును ఛేదించారు. ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు.ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు లేదా డయల్ 112కు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.

You may also like...