మంత్రి పర్యటనకు విస్తృత ఏర్పాట్లు

IMG-20260925-WA0444.jpg

జనగామ: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి శనివారం జనగామ జిల్లా పర్యటనకు రానున్న నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రిస్టన్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేస్తున్న సభా ప్రాంగణాన్ని జిల్లా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, జనగామ మున్సిపల్ చైర్‌పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్, డీసీపీ రాజమహేంద్ర నాయక్‌తో కలిసి పరిశీలించారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వేదిక, భద్రత, పార్కింగ్, ఇతర సౌకర్యాలపై అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చిమ్ముల రాజశేఖర్‌రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

You may also like...