నవంబర్ 19న సిద్దిపేట నుంచి పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
- నెల్లుట్ల చెరువు మత్తడి మరమ్మతు పనులు ప్రారంభం - November 18, 2026
- నవంబర్ 19న సిద్దిపేట నుంచి పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి - November 18, 2026
- 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు - November 18, 2026

రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి జీవిత బీమా భద్రత కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. నవంబర్ 19న సిద్దిపేట జిల్లా నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.ఈ సందర్భంగా బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పథకం అమలుకు చేపట్టాల్సిన ఏర్పాట్లు, దరఖాస్తుల సేకరణ, ప్రచార కార్యక్రమాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. జనగామ జిల్లా సమీకృత కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పాల్గొన్నారు.అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో ప్రారంభోత్సవాలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని సీఎస్ సూచించారు. ప్రతి గ్రామం, వార్డులో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి, ప్రతి కుటుంబం నుంచి బీమా పొందే వ్యక్తి, నామినీ వివరాలతో దరఖాస్తులు సేకరించాలని ఆదేశించారు. అర్హులైన ఏ కుటుంబం కూడా పథక ప్రయోజనాలకు దూరం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాతో పాటు మైక్ ప్రచారం, పోస్టర్లు, కరపత్రాలు, ప్రజా సమావేశాల ద్వారా పథకంపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.అనంతరం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో ప్రారంభోత్సవాలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి కుటుంబం నుంచి దరఖాస్తులు సేకరించి, బీమా వివరాల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని సూచించారు.ఈ సమావేశంలో జెడ్పీ సీఈవో, నోడల్ అధికారి బలరామ రావు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
