పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం జనగామలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేయాలి
- జనగామలో బైక్ దొంగల ముఠా గుట్టురట్టు - November 12, 2026
- విద్యార్థులతో కలిసి వాలీబాల్ ఆడిన కలెక్టర్.. ఘనంగా జిల్లా స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం - November 12, 2026
- ఆజాద్ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలి:ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి - November 12, 2026

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు నాగరత్న సేవా సంఘం అధ్యక్షుడు బిర్రు ఇస్తారి విజ్ఞప్తి జనగామ నియోజకవర్గంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్‌ను వెంటనే మంజూరు చేసి ఏర్పాటు చేయాలని నాగరత్న సేవా సంఘం అధ్యక్షుడు బిర్రు ఇస్తారి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను కోరారు. ఈ మేరకు జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బహుజన వర్గాలకు చెందిన పేద విద్యార్థులు, నిరుద్యోగ యువతీ యువకులకు ఉచితంగా పోటీ పరీక్షల శిక్షణ అందించాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.జనగామ జిల్లాలో అంబేద్కర్ కోచింగ్ సెంటర్ లేకపోవడంతో పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో అధిక ఫీజులు చెల్లించలేక ఎంతోమంది పోటీ పరీక్షలకు దూరమవుతున్నారని వివరించారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల యువతకు ఉచిత శిక్షణ అందిస్తే ప్రభుత్వ ఉద్యోగాలు సాధించే అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు.ఈ విషయంపై గతంలో 17-11-2025న జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌కు గ్రీవెన్స్‌లో వినతిపత్రం అందజేయగా, 25-11-2025న ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు.జనగామ జిల్లాలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేసి పేద విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఉచిత పోటీ పరీక్షల శిక్షణ అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బిర్రు ఇస్తారి విజ్ఞప్తి చేశారు. మంత్రి సానుకూలంగా స్పందించి కేంద్రం ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు.
