విద్యార్థులను పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు

పరిగి మండలం ఇబ్రహీంపూర్ గ్రామ పరిధిలోని రూప్ సింగ్ నాయక్ తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఉన్న అడవి ఆముద కాయలు తిని అస్వస్థతకు గురై పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 9 మంది విద్యార్థులను బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆసుపత్రిలో వైద్యులను కలిసి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.విద్యార్థుల తల్లిదండ్రులకు ధైర్యం చెబుతూ,వారికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.విద్యార్థులు పూర్తిస్థాయిలో కోలుకునే వరకు బాధిత విద్యార్థులకు,వారి కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని నాయకులు స్పష్టం చేశారు.ఆపద సమయంలో బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని బీఆర్ఎస్ నాయకులు భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ ముకుంద అశోక్,మాజీ ఎంపీపీ అరవింద్ రావు,సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డి, కౌన్సిలర్స్ రవి కుమార్, శ్రీనివాస్, నరేష్, పార్టీ నాయకులు,బిఆర్ఎస్వి నేతలు తదితరులు పాల్గొన్నారు.

You may also like...