రిపోర్టర్, కామారెడ్డి | 919959606808
Latest posts by Dubbaka Srinivas
(see all) కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కోరకు అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కమిటీ, డివిజన్ మండల నాయకుల ఆధ్వర్యంలో పరిశీలన చేశారు
ఈ సందర్భంగా చౌరస్తాలో విగ్రహ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని కమిటీ సభ్యులు పరిశీలించారు. విగ్రహ ఏర్పాటుకు సంబంధించి స్థల పరిశీలన, ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు, ఇతర అంశాలపై చర్చించారు.
అంబేద్కర్ ఆశయాలను భావితరాలకు తెలియజేసే విధంగా ఎల్లారెడ్డిలో ప్రతిష్టాత్మకంగా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని యువజన సంఘం నాయకులు పేర్కొన్నారు. విగ్రహ ఏర్పాటుకు సంబంధిత అధికారుల సహకారం తీసుకుని త్వరితగతిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కమిటీ సభ్యులు, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు గంగారం, ప్రధాన కార్యదర్శి రాజు, ముదాం సాయిలు, యాదయ్య, లీడర్ రవీందర్ ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి బిట్ల సురేందర్, డివిజన్ అధ్యక్షులు మర్లు సాయిబాబా, ఉపాధ్యక్షుడు సాయిలు, లెగ్గల రాజు, ప్రధాన కార్యదర్శి రొడ్డ సాయిబాబా, డివిజన్ కోశాధికారి భూపతి, ఎల్లారెడ్డి మండల ప్రధాన కార్యదర్శి కుసుల కంటి సాయిలు, అడవి లింగాల అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు కోరన్ పల్లి శ్రీనివాస్, నాయకులు, పాల్గొన్నారు.