సంక్షేమ పథకాల పంపిణీలో రాజకీయం చేయడం తగదు : కట్టంగూర్ ఉప సర్పంచ్ గుండు రాంబాబు

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 18 : ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాల పంపిణీలో కట్టంగూర్ సర్పంచ్ ముక్కాముల శ్యామల రాజకీయాలు చేయడం సరికాదని కట్టంగూర్ ఉప సర్పంచ్ గుండు రాంబాబు ఆరోపించారు. కట్టంగూర్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులతో కలిసి బుధవారం విలేకర్లతో మాట్లాడారు. కట్టంగూర్ ఎంపిడీఓ కార్యాలయంలో మంగళవారం పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ సందర్భంగా సర్పంచ్ వ్యవహరించిన తీరు సబబుగా లేదన్నారు. పింఛన్ల పంపిణీ సమయంలో సర్పంచ్ అందుబాటు లేకపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శులతో కలిసి తాను మంజూరు పత్రాలను పంపిణీ చేస్తుండగా సర్పంచ్ వచ్చి తన చేతి లో ఉన్న పత్రాలను లాక్కొని పంపిణీకి ఆటంకం కలిగించిందిని ఆరోపించారు. గత కొంత కాలంగా జరుగుతున్న అవినీతి అక్రమాలు బయటపెట్టడం వల్ల సర్పంచ్ నాతో పాటు వార్డులపై క్షక్ష పెంచుకొని రాజకీయాలు చేస్తుందని పేర్కొన్నారు. విలేకర్ల సమావేశంలో వార్డు సభ్యులు ఎరుకల శశికుమార్, అయితగోని సైదులు, అయితగోని సైదమ్మ, కానుగు శ్రీను, బొమ్మగాని మహేష్, మైనం ఉమా అంబేద్కర్, ముషం లావణ్య ఉమేష్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...