బొల్లంపల్లిలో అధికారులకు ఘన సన్మానం
- బొల్లంపల్లిలో అధికారులకు ఘన సన్మానం - October 29, 2026
- పట్టభద్రుల ఓటు నమోదు చేసుకున్న వడ్త్యావత్ రాజు నాయక్ - October 28, 2026
- ప్రమాదంలో గాయపడిన డ్యాన్స్ మాస్టర్‌కు గోలి శ్రీనివాస్ రెడ్డి పరామర్శ.. రూ.5 వేల సాయం - October 28, 2026

కల్వకుర్తి అక్టోబర్ 28: వెల్దండ మండల ఎంపీఓ లింగయ్య, నూతన పంచాయతీ కార్యదర్శి శ్రావణ్ కుమార్‌లను బొల్లంపల్లి సర్పంచ్ సత్తూరి ప్రసాద్ గౌడ్ శాలువాలతో ఘనంగా సన్మానించారు. బుధవారం నిర్వహించిన ప్రత్యేక గ్రామసభకు తొలిసారిగా హాజరైన అధికారులను వార్డు సభ్యులు సత్కరించారు. గతంలో విధులు నిర్వహించిన పంచాయతీ కార్యదర్శి అన్నపూర్ణను ఆదర్శ యువజన సంఘం సభ్యులు, పారిశుద్ధ్య కార్మికులు సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రామకృష్ణ, వార్డు సభ్యులు వడ్త్యావత్ దన్సింగ్ నాయక్, కొమ్ము వెంకటయ్య, పోలే అంజయ్య, అల్లే నరేష్, కట్ట పద్మమ్మ, నేనావత్ ధన్సింగ్ నాయక్, అనుష, లస్కర్ అఖిల, అందోజు శిరీష తదితరులు పాల్గొన్నారు.
