పేదల సొంతింటి కలను సహకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

1001226639.jpg

నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎలుమ ఫంక్షన్ హాల్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సి కూచుకుల్ల దామోదర్ రెడ్డి,జిల్లా కలెక్టర్ జిల్లా మేజిస్ట్రేట్ హేమంత కేశవ్ పాటిల్,మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ సునేంద్ర ,ఎమ్మార్వో తబితా రాణి గారు , ఆర్డీవో అర్చన,కౌన్సిలర్లు,కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు,లబ్ధిదారులు,తదితరులు హాజరయ్యారు.అలాగే జిల్లా డీసీసీ కార్యదర్శి కొత్త శ్రీనివాసులు,పొడుగు శ్రీనివాసులు పాల్గొన్నారు.13వ వార్డు మరియు 2వ వార్డుకు చెందిన లబ్ధిదారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.కొత్త శ్రీనివాసులు మాట్లాడుతూ..

పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత. ప్రతి పేద కుటుంబానికి గౌరవప్రదమైన జీవనం, సొంత ఇంటి భద్రత కల్పించాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది.ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ,అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు.పేదల పక్షాన నిలబడేది కాంగ్రెస్ పార్టీనే. ప్రజల సమస్యలను నేరుగా విని, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం.డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో అర్హులైన ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి.నాగర్ కర్నూల్ అభివృద్ధి, పేదల సంక్షేమం,ప్రజల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల మధ్యనే ఉంటుంది అని అన్నారు.

You may also like...