ప్రమాదంలో గాయపడిన డ్యాన్స్ మాస్టర్‌కు గోలి శ్రీనివాస్ రెడ్డి పరామర్శ.. రూ.5 వేల సాయం

కల్వకుర్తి:రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోలుకుంటున్న డ్యాన్స్ మాస్టర్ శేఖర్‌ను తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, కల్వకుర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యం పరామర్శించారు. శేఖర్ నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో కల్వకుర్తి మండల పార్టీ అధ్యక్షుడు సింగం విజయ్ గౌడ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సాహెద్, మాజీ ఉపసర్పంచ్ నిరంజన్, కౌన్సిలర్ రాములు, జిల్లా నాయకులు నాగులు నాయక్, మాజీ సర్పంచ్ అంజి నాయక్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు జోగయ్యతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.1001307240.jpg

You may also like...