TGPSC AEE పరీక్ష తేదీలో మార్పు
- మందుల ధరల దోపిడీపై సుప్రీంకోర్టు ఆగ్రహం! - October 27, 2026
- వర్షాభావం వేళ.. గ్రామీణ కూలీలకు 125 రోజుల పని భరోసా! - October 27, 2026
- TGPSC AEE పరీక్ష తేదీలో మార్పు - October 27, 2026

తెలంగాణలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) సివిల్ నియామక పరీక్ష తేదీలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) మార్పు చేసింది. నవంబర్ 6న నిర్వహించాల్సిన పరీక్షను నవంబర్ 7కు వాయిదా వేసినట్లు ప్రకటించింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నిర్వహించే జూనియర్ ఇంజినీర్ (JE) సివిల్ పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులకు మాత్రమే ఈ మార్పు వర్తిస్తుందని స్పష్టం చేసింది. నవంబర్ 6న రెండు పరీక్షలు ఒకే రోజు ఉండటంతో అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో రెండు పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు కొంత వెసులుబాటు లభించనుంది. అభ్యర్థులు పరీక్ష తేదీకి సంబంధించిన పూర్తి వివరాలు, తాజా సూచనల కోసం TGPSC అధికారిక ప్రకటనను పరిశీలించాలని సూచిస్తున్నారు.
