ప్రభుత్వ భవన స్థలాలను పరిశీలించిన మంత్రి జూపల్లి కృష్ణారావు

1001243729.jpg

నాగర్ కర్నూల్: చిన్నంబావి మండల కేంద్రంలో కల్చరల్‌ బిల్డింగ్‌, స్టేడియం, పలు ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం పరిశీలించారు. పెద్దమారూర్‌ గ్రామ రెవెన్యూ శివారులోని సర్వే నంబర్‌ 113లో సుమారు 10 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిశీలించారు.కల్టివేషన్‌ లేకుండా బంజరు భూమిగా ఉన్న ఈ ప్రాంతాన్ని ప్రభుత్వ అవసరాలకు వినియోగించేలా సర్వే నిర్వహించాలని తహసీల్దార్‌ను మంత్రి ఆదేశించారు. అవసరమైన స్థలాన్ని గుర్తించి తదుపరి చర్యలు చేపట్టాలని సూచించారు.అనంతరం చిన్నంబావి మండల కేంద్రంలో వీపనగండ్ల, చిన్నంబావి మండలాలకు చెందిన జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణాలను మంత్రి పరిశీలించారు. అర్హులైన లబ్ధిదారులను త్వరలో గుర్తించి వారికి న్యాయం చేస్తామని జూపల్లి తెలిపారు.

You may also like...