ఈసీని తొలగించాలని సిపిఎం, సిపిఐ పార్టీలు ధర్నాకు పిలుపు

నాగర్‌కర్నూల్: కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ గుప్తాను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 6న నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి ఎఫ్‌ఎండీ ఫయాజ్, సీపీఎం జిల్లా కార్యదర్శి వి.పర్వతాలు తెలిపారు.

సోమవారం సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను తొలగించాలనే డిమాండ్‌తో చేపడుతున్న ఆందోళనకు వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హాజరై విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.1001238365.jpg

You may also like...