సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం
- సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం - October 5, 2026
- తాళం వేసిన ఇంట్లో చోరీ…. - October 5, 2026
- గురుశిష్యులకు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం భాషా బోధనలో విశిష్ట సేవలకు గుర్తింపు - October 5, 2026
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 5: అనారోగ్యంతో వైద్య చికిత్స చేయించుకునే ఆర్థిక స్థోమత లేని పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరంలాంటిదని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. కట్టంగూర్ మండల కేంద్రానికి చెందిన కొండ వెంకన్న, పొడిచేటి సైదులు, గుండు రేణుక, పగిళ్ల పద్మ, పోగుల శ్రీనుకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను సోమవారం నకిరేకల్‌లోని తన క్యాంపు కార్యాలయంలో బాధితులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాల్లో అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడు వైద్య ఖర్చులు భరించడం భారంగా మారుతుందన్నారు. అలాంటి కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందించి అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజలకు అవసరమైన సమయంలో ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు.
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ వాటి ప్రయోజనాలు అందేలా ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన ఆర్థిక సాయంతో బాధిత కుటుంబాలకు కొంత మేర ఆర్థిక భారం తగ్గుతుందని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజులా మాధవరెడ్డి, మాజీ జడ్పీటీసీ మాద యాదగిరి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంకరబోయిన వెంకన్న, రెడ్డిపల్లి వీరస్వామి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

