కొట్ర గ్రామంలో కరెంటు కటకటాలు.. ప్రజావాణిలో సర్పంచ్ ఫిర్యాదు

1001238024.jpg

వెల్దండ అక్టోబర్ 05:వెల్దండ మండల పరిధిలోని కొట్ర గ్రామంలో నెలకొన్న తక్కువ వోల్టేజ్ విద్యుత్ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సర్పంచ్ శారద చెన్నయ్య ఆధ్వర్యంలో గ్రామస్థులు సోమవారం వెల్దండ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఎంపీడీవో సులోచనకు వినతిపత్రం అందజేశారు.గ్రామంలో సుమారు 100 ఇళ్లకు విద్యుత్ సరఫరా సక్రమంగా అందడం లేదని వారు తెలిపారు. ముఖ్యంగా రాత్రివేళల్లో ఫ్యాన్లు, లైట్లు సరిగా పనిచేయక దోమల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అలాగే గ్రామంలో ఎత్తు తక్కువగా ఉన్న విద్యుత్ స్తంభాలు ఉండటంతో పెద్ద వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు.విద్యుత్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడంతో పాటు గ్రామానికి 20 నూతన విద్యుత్ స్తంభాలను మంజూరు చేయాలని అధికారులను కోరారు.ఈ సందర్భంగా సర్పంచ్ శారద చెన్నయ్య మాట్లాడుతూ విద్యుత్ సమస్యపై సంబంధిత అధికారులకు పలుమార్లు సమాచారం అందించినప్పటికీ స్పందన సరిగా లేదని ఆరోపించారు. సమస్యపై ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించినా ఫోన్‌లు లిఫ్ట్ చేయడం లేదని, ప్రజల సమస్యలపై అధికారులు బాధ్యతాయుతంగా స్పందించాలని కోరారు. విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి కొట్ర గ్రామంలోని తక్కువ వోల్టేజ్ సమస్యను పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు.

You may also like...