పత్తి రైతుల సమస్యలు పరిష్కరించాలి

IMG-20261005-WA0442.jpg

పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ పత్తి రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ భూక్యా చందు నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం జనగామ తహసీల్దార్ కార్యాలయం ఎదుట సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ శ్రీధర్‌కు అందజేశారు.ఈ సందర్భంగా చందు నాయక్ మాట్లాడుతూ.. పత్తి దిగుబడి తగ్గడంతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పత్తి మిల్లుల్లో సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏకకాలంలో ప్రారంభించాలని, తేమతో సంబంధం లేకుండా పత్తిని కొనుగోలు చేయాలని కోరారు. రైతులకు సమీపంలోని సీసీఐ కేంద్రాల్లో పత్తి విక్రయించే అవకాశం కల్పించాలని, క్వింటాల్‌కు రూ.475 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. L1 నుంచి L5 విధానాలను ఉపసంహరించడంతో పాటు కాపస్ కిసాన్ యాప్‌లో స్లాట్ సమస్యలను పరిష్కరించాలని, గతంలో మాదిరిగా ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయాలని కోరారు.కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మంగ బీరయ్య, న్యాయవాది బిట్ల గణేష్, బండ సత్తయ్య, పోతుకనూరి ఉపేందర్, అజ్మీర సురేష్ నాయక్, కర్రే యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

You may also like...