పేద ప్రజల ఆరోగ్యానికి సీఎం రిలీఫ్ భరోసా.. ఎమ్మెల్యే కసిరెడ్డి
- మరికొద్ది క్షణాల్లో టంగుటూరుకు మందకృష్ణ మాదిగ - October 15, 2026
- దేవుల నాయక్కు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడి జన్మదిన శుభాకాంక్షలు - October 12, 2026
- పెళ్లి హామీతో లైంగిక వేధింపుల ఆరోపణ.. డీఐ బాలస్వామి అరెస్ట్! - October 11, 2026

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 25: పేద ప్రజల ఆరోగ్యానికి సీఎం రిలీఫ్ భరోసాగా ఉంటుందని కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. బుధవారం ఆయన నివాసంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..పేద ప్రజల ఆరోగ్యమే తమ ప్రభుత్వ లక్ష్యమని, అనారోగ్యంతో బాధపడుతున్న ఏ ఒక్కరూ ఆర్థిక ఇబ్బందులతో బాధపడకూడదనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా,అర్హులైన ప్రతి ఒక్కరికీ సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి డి. రఘు రాములు, మాజీ సర్పంచ్ పయ్యావుల రమేష్ యాదవ్, మాజీ ఎంపీటీసీ దాసరి యాదయ్య,సురేందర్ రెడ్డి, అవంచ నర్సింహారెడ్డి, రేణు రెడ్డి, శివకుమార్,శ్రీశైలం, వివిధ గ్రామాల,మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
