శంకర్‌పల్లి పీహెచ్‌సీలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ విజయవంతం

శంకర్‌పల్లి పీహెచ్‌సీలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ విజయవంతం
శంకర్‌పల్లి: శంకర్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) ఆధ్వర్యంలో బాలికల కోసం నిర్వహించిన హెచ్‌పీవీ (HPV) వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం 19 మంది బాలికలు వ్యాక్సిన్ పొందినట్లు మెడికల్ ఆఫీసర్ డా. రేవతి తెలిపారు.
ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డా. రేవతి మాట్లాడుతూ, బాలికల ఆరోగ్య రక్షణలో హెచ్‌పీవీ వ్యాక్సిన్ కీలక పాత్ర పోషిస్తుందని, ముఖ్యంగా గర్భాశయ క్యాన్సర్ నివారణకు ఇది సమర్థవంతమైన రక్షణను అందిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమం వచ్చే 90 రోజుల పాటు కొనసాగనున్నందున అర్హత కలిగిన బాలికలంతా ఈ అవకాశాన్ని తప్పనిసరిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
అదేవిధంగా, మా ఆరోగ్య కార్యక్రమాలు విజయవంతం కావడానికి సహకారం అందించిన పత్రిక ప్రతినిధులకు డా. రేవతి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజల సహకారంతో మరింత మెరుగైన ఆరోగ్య సేవలను అందించేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు
