బాలికతో అసభ్యకర ప్రవర్తన కీచక టీచర్‌కి దేహశుద్ధి

బాలికతో అసభ్యకర ప్రవర్తన కీచక టీచర్‌కి దేహశుద్ధి


జ్ఞాన తెలంగాణ,వికారాబాద్ :వికారాబాద్ జిల్లాలో ఓ కీచక టీచర్ బాగోతం బయటపడింది. కంప్యూటర్ శిక్షణ కోసం వచ్చిన ఓ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం. బాలిక కంప్యూటర్​కోర్స్​నేర్చుకోవడానికి వికారాబాద్​జిల్లా కేంద్రంలోని బ్రెయిన్ ట్రీ కంప్యూటర్​ట్రైనింగ్​సెంటర్​కు వెళ్తోంది. రోజూ మాదిరిగానే మంగళవారం కూడా వెళ్లింది.సెంటర్​నిర్వాహకుడు నవాజ్​ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాధితురాలు ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపింది.ఆగ్రహంతో వారు కంప్యూటర్ సెంటర్​కు వచ్చి నవాజ్​కు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

You may also like...

Translate »