స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం….
- A Hero’s Journey to Conquer New Horizons - May 23, 2025
- Playing It Safe: Tips and Tricks for Shaolin Soccer - May 23, 2025
- Uncovering the Mystery of 3 Carts of Gold’s Bonus System - May 23, 2025

స్టేషన్ ఘనపూర్ జ్ఞాన తెలంగాణ
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం….
వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య పరిచయ మరియు ఆత్మీయ సన్మానం….(హెడ్డింగ్)
ఘన స్వాగతం పలికిన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు…
వరంగల్ పార్లమెంట్ ఎన్నికలలో భారీ మెజారిటీతో అఖండ విజయం సాధించిన డాక్టర్ కడియం కావ్య గారిని ఘనంగా సన్మానించిన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలు….
మడికొండ సత్య సాయి కన్వెన్షన్ హాల్లో మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధ్యక్షతన ఏర్పాటు చేసిన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం మరియు వరంగల్ పార్లమెంట్ ఎన్నికలలో భారీ మెజారిటీతో విజయం సాధించిన డాక్టర్ కడియం కావ్య పరిచయ, ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర అటవీ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ
అభివృద్ధిలో అగ్రగామిగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం ఉండాలి.
ఇప్పుడు నా బాధ్యత పెరిగింది.
నియోజకవర్గంలో గ్రూపులు లేవు
ఎవరైనా గ్రూపులు అని తిరిగితే తోకలు కత్తిరించడం ఖాయం
పని లో పోటీ పాడుదాం… కూర్చునే సీటులో కాదు
దేవాదుల ప్రాజెక్టు తో నియోజకవర్గంలో ప్రతీ గ్రామానికి సాగు నీరు అందించె బాధ్యత నాది
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో విద్యా, వైద్యంలో చాలా వెనక బడి ఉన్నాం
విద్యా, వైద్యంలో అన్ని రకాల అభివృద్ధికి త్వరలోనే శ్రీకారం చుట్టాలి.
నియోజకవర్గంలో పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత ఉంది.
నా ఎజెండా అభివృద్ధి, విద్యా, వైద్యం, ప్రతీ ఎకరాకు సాగు నీరు అందించడం.
నియోజకవర్గ ప్రజలు నన్ను అర్థం చేసుకోవాలి
ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ
నాకు భారీ మెజారిటీతో విజయాన్ని అందించిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికి పేరు పేరునా కృతజ్ఞతలు
ఎవరికీ వారే అభ్యర్థిగా భావించి నా కోసం కష్ట పడ్డారు.
నా గెలువుకు కృషి చేసిన ప్రతీ ఒక్కరికీ అందుబాటులో ఉంటు మీ అందరి కష్టసుఖలలో పాలు పంచుకుంటాను.
మీ అందరి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి.
రాబోయే రోజుల్లో మంచి రోజులు రానున్నాయి.
ఎంపీ ఎన్నికలతో అయిపోలేదు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగురావేయాలి.
నా తండ్రి కడియం శ్రీహరి గారు నిలబెట్టే విధంగా పని చేస్తాను
మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ
డాక్టర్ కడియం కావ్య గెలుపుకు కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు
కడియం శ్రీహరి వ్యక్తిత్వం గొప్పది
కడియం శ్రీహరి గొప్ప పరిపాలన అనుభవం ఉన్నది, అవినీతి రహితమైన పాలన అందించే వ్యక్తి కడియం శ్రీహరి .
స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ఇదే క్రమశిక్షణతో పని చేయాలి.
కాంగ్రెస్ పార్టీలో ప్రతీ ఒక్కరికీ సమూచిత స్థానం దక్కుతుంది.
కార్యకర్తలు ఓపికగా ఉండాలి.
అర్హులైన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలి.
ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలో నిష్పాక్షపాతంగా, అవినీతి రహితంగా అర్హులైన వారికే సంక్షేమ పథకాలు అందాలి.
దానికోసం సమన్వయంతో పని చేయాల్సిన బాధ్యత ఉంది
తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకోవాలి
రాబోయే రోజులల్లో మంచి రాజకీయ భవిష్యత్ ఉంది
వరంగల్ పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గలను సమ దృష్టితో చూడాలి.
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేయాలి.
ఎల్లపుడు నీకు మా అందరి ఆశీస్సులు ఉంటాయి.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి , కేఆర్ నాగరాజు , గండ్ర సత్యనారాయణ , ఏఐసిసి ప్రధాన కార్యదర్శి సింగపురం ఇందిర , కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి రెడ్డి , తెలంగాణ రాష్ట్ర ఆపేక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నెని రవీందర్ రావు , మేయర్ గుండు సుధారాణి , డీసిసీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి , ఐత ప్రకాష్ రెడ్డి కార్ప ఆయిల్ సిడ్స్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి , ఇతర కార్పొరేషన్ చైర్మన్లు, ఏఐసిసి నాయకులు, జిల్లా నాయకులు, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
