Daily Archive: November 17, 2026
శాపూర్‌నగర్: హెచ్ఎంటీ ప్రీమియర్ లీగ్ సీజన్–6 క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఉత్సాహంగా నిర్వహించారు. 291వ డివిజన్‌కు చెందిన ఫయాజ్, నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలకు ముఖ్య అతిథిగా కూన రాఘవేందర్ గౌడ్ హాజరై క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఐక్యత, స్నేహభావాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని పిలుపునిచ్చారు. టోర్నమెంట్ నిర్వాహకులు ఫయాజ్, నాగరాజును ప్రత్యేకంగా అభినందించారు. యువత అభివృద్ధికి క్రీడల్లో…
మేడ్చల్: ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. తుముకుంట డబుల్ బెడ్రూమ్ కాలనీలో రూ.5 కోట్లతో డ్రైనేజీ పనులు, దమ్మాయిగూడ ఆర్జేకే ప్రాంతంలో మరో రూ.5 కోట్లతో స్టార్మ్ వాటర్ డ్రైన్ పనులకు ఆయన, డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ శంకుస్థాపన చేశారు. పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో నక్క ప్రభాకర్ గౌడ్, పిసరి మహిపాల్ రెడ్డి,…
ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని పీజేఆర్ నగర్ కాలనీ బ్లాక్ నెంబర్ 19 2TF లో నివసించే కానూరు అరుణ (62) అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న డివిజన్ మాజీ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు స్థానిక నాయకులను ఆదేశించి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి డివిజి ట్రస్ట్ ద్వారా 5,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. రవీందర్, కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు ఉన్నారు.
హైదరాబాద్: భారత రాజ్యాంగ పరిరక్షణ, చట్టాల అమలుపై అవగాహన కల్పించే లక్ష్యంతో టీజీఎస్ఆర్టీసీ రాణిగంజ్ డిపోలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 279వ వారపు జ్ఞాన పూలమాల కార్యక్రమం నిర్వహించారు. ప్రతి మంగళవారం నిర్వహించే ఈ కార్యక్రమంలో బహుజన కార్మికులు పాల్గొని అంబేద్కర్‌కు నివాళులర్పించారు. ఈ వారం తిరుపతి, కండక్టర్ మహేష్, డ్రైవర్ జీవన్, శ్రామిక్ కే. రవీందర్, మేకల రాజేందర్, మంత్రి కృష్ణ, సుద్దాల సురేష్, ఎం. గోపి…
కుత్బుల్లాపూర్: ఉమాదేవి నగర్ కాలనీ అభివృద్ధిలో భాగంగా ఎనిమిది గల్లీల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.60 లక్షలు, ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి రూ.2.60 లక్షల నిధులు మంజూరయ్యాయి. జోనల్ కమిషనర్, ఐఏఎస్ అధికారి పింకేష్తో చర్చించి నిధుల మంజూరుకు ప్రత్యేక చొరవ తీసుకున్న కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కొలన్ హన్మంత్ రెడ్డి, 277వ మహాదేవపురం డివిజన్ అధ్యక్షుడు సిద్ధనోళ్ల సంజీవరెడ్డికి కాలనీ కమిటీ సభ్యులు షెర్విరాల కృష్ణమూర్తి గుప్త, మహేష్ గౌడ్, కాలనీవాసులు కృతజ్ఞతలు…
ఖరీదైన విదేశీ మద్యం సీసాల్లో చౌకబారు మద్యాన్ని నింపి, ఎక్కువ ధరలకు విక్రయిస్తున్న ముఠాను గ్రేటర్ హైదరాబాద్ ఎక్సైజ్ (DTF) టాస్క్ ఫోర్స్ అధికారులు అరెస్టు చేశారు.
తలకొండపల్లి నవంబర్ 17 :రంగారెడ్డి జిల్లాలో రైతులకు శుభవార్త. తలకొండపల్లి మండలంలోని వెల్జాల్ గ్రామంలో నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.అదేవిధంగా కడ్తాల్ మండలంలోని కర్తాల్ గ్రామంతో పాటు, మాడుగుల మండలంలోని ఇర్విన్ గ్రామంలోనూ నూతన పీఏసీఎస్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది.ఈ నిర్ణయంతో ఆయా ప్రాంతాల రైతులకు వ్యవసాయ రుణాలు, ఎరువులు, విత్తనాలు తదితర సేవలు స్థానికంగానే అందుబాటులోకి వచ్చే అవకాశం…
కల్వకుర్తి,నవంబర్ 17: నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ మంగళవారం కల్వకుర్తి మండలంలోని పంజుగుల ప్రాథమికోన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఒకటి నుంచి ఏడు తరగతులకు గాను ప్రస్తుతం 40 మంది విద్యార్థులకు నలుగురు ఉపాధ్యాయులు ఉన్నట్లు అధికారులు వివరించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగేలా కృషి చేయాలని సూచించారు.అనంతరం తరగతి గదులు, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యాలు, పరిసరాల పరిశుభ్రతతో…
తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ వికారాబాద్ జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది,ఇందులో భాగంగా జిల్లా అధ్యక్షులు గా పరిగికి చెందిన Ntv రిపోటర్ శ్రీనివాస్ ను ఎన్నికయ్యారు, కార్యదర్శిగా ఐ న్యూస్ రిపోటర్ పర్శమోని బాబును ఎన్నికయ్యారు,ఈ సందర్భంగా అవకాశం కల్పించిన రాష్ట్ర,జిల్లా నియోజకవర్గ నాయకులకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
నాగర్‌కర్నూల్ నవంబర్ 17 :నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి తెలిపారు. నాగర్‌కర్నూల్ మండలంలోని సాయి గార్డెన్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో చేయూత పింఛన్ల పథకంలో భాగంగా వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు పింఛన్ మంజూరు పత్రాలను ఆయన పంపిణీ చేశారు.ఈ నెల 19న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పింఛన్ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా రెండో…