రైతులకు శుభవార్త మూడు గ్రామాలకు కొత్త పీఏసీఎస్‌లు.. ప్రభుత్వ అనుమతి!

1001371084.png

తలకొండపల్లి నవంబర్ 17 :రంగారెడ్డి జిల్లాలో రైతులకు శుభవార్త. తలకొండపల్లి మండలంలోని వెల్జాల్ గ్రామంలో నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.అదేవిధంగా కడ్తాల్ మండలంలోని కర్తాల్ గ్రామంతో పాటు, మాడుగుల మండలంలోని ఇర్విన్ గ్రామంలోనూ నూతన పీఏసీఎస్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది.ఈ నిర్ణయంతో ఆయా ప్రాంతాల రైతులకు వ్యవసాయ రుణాలు, ఎరువులు, విత్తనాలు తదితర సేవలు స్థానికంగానే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కొత్త సహకార సంఘాల ఏర్పాటుతో రైతులకు సేవలు మరింత చేరువ కానున్నాయి.ప్రభుత్వ ఉత్తర్వుల అధికారిక ప్రతులు అందిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.

You may also like...