హెచ్ఎంటీ ప్రీమియర్ లీగ్ సీజన్‌–6

  • శాపూర్‌నగర్: హెచ్ఎంటీ ప్రీమియర్ లీగ్ సీజన్‌–6 క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఉత్సాహంగా నిర్వహించారు. 291వ డివిజన్‌కు చెందిన ఫయాజ్, నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలకు ముఖ్య అతిథిగా కూన రాఘవేందర్ గౌడ్ హాజరై క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఐక్యత, స్నేహభావాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని పిలుపునిచ్చారు. టోర్నమెంట్ నిర్వాహకులు ఫయాజ్, నాగరాజును ప్రత్యేకంగా అభినందించారు. యువత అభివృద్ధికి క్రీడల్లో ఎల్లప్పుడూ ప్రోత్సాహం అందిస్తామని పేర్కొన్నారు.

You may also like...