Monthly Archive: September 2026

మట్టి వినాయకుడిని పూజిద్దాం – పర్యావరణం కాపాడుదాం: గోలి శ్రీనివాస్ రెడ్డి

కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.వినాయక చవితి పవిత్రమైన పండుగ అని, భక్తితో పాటు బాధ్యత కూడా అవసరమన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన రంగుల విగ్రహాల వల్ల చెరువులు, కుంటలు కలుషితమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఈసారి ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడినే పూజించాలని, సహజ రంగుల విగ్రహాలను ప్రోత్సహించాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని పిలుపునిచ్చారు. కల్వకుర్తిలోని చెరువులు, కుంటలు మన జీవనాధారమని,…

జనగామలో మానవత్వం చాటిన ట్రాఫిక్ పోలీసులు

జనగామ పట్టణంలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు మానవత్వం చాటారు. భువనగిరికి చెందిన ఓ మహిళ దారి తప్పి, ఆకలితో ఇబ్బందులు పడుతుండగా ట్రాఫిక్ పోలీసుల దృష్టికి వచ్చింది.వెంటనే పోలీసులు ఆమెను గుర్తించి, వివరాలు తెలుసుకున్నారు. ఆమెకు ఆహారం అందించి, సురక్షితంగా ఇంటికి చేరుకునేలా సహాయం చేశారు. పోలీసుల మానవతా దృక్పథాన్ని పలువురు అభినందించారు.

జనగామ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు, మున్సిపల్ సిబ్బందికి వైద్య శిబిరం

జనగామ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు మరియు మున్సిపల్ సిబ్బంది ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది.ఈ వైద్య శిబిరానికి మున్సిపాలిటీలోని మొత్తం 183 మంది సిబ్బందికి గాను 163 మంది సిబ్బంది హాజరయ్యారు. హాజరైన సిబ్బందికి సమగ్ర హెల్త్ చెకప్ నిర్వహించడంతో పాటు అవసరమైన రక్త నమూనాలు మరియు ఇతర వైద్య పరీక్షల కోసం నమూనాలు సేకరించడం జరిగింది.మున్సిపల్ సిబ్బంది ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ, వారి ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన చర్యలు…

చొక్కన్నపల్లి మాదిగల మానవతా సహాయం రూ. 28500/-అందజేత

వెల్దండ మండలం:చొక్కన్నపల్లి గ్రామానికి చెందిన కొమ్ము చిన్న నాగయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో చొక్కన్నపల్లి మాదిగల ఐక్యవేదిక సభ్యులు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చారు.మాదిగల ఐక్యవేదిక సభ్యులందరి సహకారంతో జమ చేసిన రూ. 28,500/- రూపాయలను మృతుని భార్యకు అందజేశారు. ఆపత్కాల సమయంలో అండగా నిలిచి ఆర్థిక సాయం అందించడం పట్ల మండల ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది గొప్ప మానవతా దృక్పథమని కొనియాడుతున్నారు.ఈ కార్యక్రమంలో…

ఆర్. కృష్ణయ్యకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బండమీది వెంకటేష్

హైదరాబాద్ విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో బీసీ వర్గాల రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య జన్మదిన వేడుకలు నిర్వహించారు. చేవెళ్ల నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బండమీది వెంకటేష్ ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. బీసీల హక్కుల పరిరక్షణ,...

ఆర్.కృష్ణయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బండమీది వెంకటేష్

హైదరాబాద్ విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో బీసీ వర్గాల రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. చేవెళ్ల నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు బండమీది వెంకటేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్. కృష్ణయ్యకు...

మట్టి గణపతులకు పట్టం – లోగోను ఆవిష్కరించిన సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్

వెల్దండ, సెప్టెంబర్ 12:వెల్దండ గ్రామంలో ఏర్పాటు చేయనున్న మట్టి గణపతుల వినాయక మండపం లోగోను గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ ఆవిష్కరించారు.పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కాకుండా మట్టి గణపతులనే పూజించాలనే ఉద్దేశంతో గ్రామ యువకులు ఈ ఏడాది మట్టి గణపతి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రూపొందించిన ఆహ్వాన పత్రిక లోగోను సర్పంచ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు పాల్గొన్నారు. మట్టి గణపతుల వాడకంతో చెరువులు, కుంటలు…