వినాయక భక్త బృందానికి జక్కుల చిన్న జంగయ్య యాదవ్ చేయూత
- వినాయక భక్త బృందానికి జక్కుల చిన్న జంగయ్య యాదవ్ చేయూత - September 21, 2026
- కార్యకర్తల ఐక్యతే కాంగ్రెస్ పార్టీకి బలం – సమిష్టి కృషే కాంగ్రెస్ విజయానికి పునాది - September 21, 2026
- వినాయకుని సన్నిధిలో ప్రత్యేక పూజలు -గోలి శ్రీనివాస్ రెడ్డి - September 21, 2026
వినాయక భక్త బృందానికి జక్కుల చిన్న జంగయ్య యాదవ్ చేయూత
వెల్దండ: మండలంలోని బొల్లంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని చల్లపల్లి గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక భక్త బృందానికి గ్రామానికి చెందిన జియాగూడ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జక్కుల చిన్న జంగయ్య యాదవ్ చేయూత అందించారు.తన వ్యక్తిగత నిధులతో రూ.51 వేల విలువైన మైక్ సెట్, బాక్సులను భక్త బృందానికి వితరణ చేశారు. వినాయక పూజా కార్యక్రమాలు, భక్తి పాటల నిర్వహణకు భక్త బృందానికి ఈ పరికరాలు ఉపయోగ పడనున్నాయి. అనంతరం యూత్ సభ్యులు ఆయనను శాలువాతో సన్మానించి ఘనంగా సన్మానం సత్కరించారు.ఈ సందర్భంగా జక్కుల చిన్న జంగయ్య యాదవ్ మాట్లాడుతూ.. గ్రామంలో జరిగే ప్రతి అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమానికి పార్టీలకతీతంగా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. గ్రామ ప్రజల ఐక్యత, యువత సేవా కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు.
