కార్యకర్తల ఐక్యతే పార్టీకి బలం : వంశీచంద్

కార్యకర్తల ఐక్యతే పార్టీకి బలమని, సమిష్టి కృషే కాంగ్రెస్ విజయానికి పునాది అని కాంగ్రెస్ నాయకులు వంశీచంద్ రెడ్డి అన్నారు.

ఆమనగల్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఇటీవల నూతనంగా నియమితులైన ఆమనగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మరియు పట్టణ అధ్యక్షులు శ్రీ శివలింగం లను మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని, కార్యకర్తలందరినీ సమన్వయం చేసుకుంటూ ప్రజలకు మరింత చేరువగా పనిచేయాలని నూతన అధ్యక్షులకు సూచించారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆకాంక్షించారు.1001336555.jpg

You may also like...