Monthly Archive: September 2026

గణేష్ నిమజ్జన ఉత్సవాల్లో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.. డీఎస్పీ

కల్వకుర్తి: గణేష్ నిమజ్జన ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భక్తులు, నిర్వాహకులు నిబంధనలు పాటించాలని డీఎస్పీ సైరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. కల్వకుర్తి మండల పరిధిలోని సిలార్పల్లి గ్రామ సమీపంలోని ఈదుల చెరువును పుర కమిషనర్ మహ్మద్ షేక్‌తో కలిసి ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 23వ తేదీ మధ్యాహ్నం వరకు గణేష్ విగ్రహాలను ఈదుల చెరువులో నిమజ్జనం చేయాలని, ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. నిబంధనలు పాటించని వారిపై…

ఆమనగల్ ఆరోగ్యానికి భరోసా – రూ. 17.50 కోట్లతో ఆధునిక ఆసుపత్రి నిర్మాణం

ఆమనగల్: ఆమనగల్ పట్టణంలో రూ.17.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 50 పడకల ఆధునిక ప్రభుత్వ ఆసుపత్రి పనులను ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆసుపత్రి నిర్మాణ పురోగతి, నాణ్యత ప్రమాణాలు, వివిధ విభాగాల ఏర్పాట్లపై అధికారులను, కాంట్రాక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు.నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడొద్దని, పనులను వేగవంతంగా పూర్తి చేసి నిర్ణీత గడువులోగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్‌ను ఎమ్మెల్యే ఆదేశించారు. ఆసుపత్రి అందుబాటులోకి వస్తే ఆమనగల్‌తో పాటు పరిసర…

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం రెండు లక్షల ఇల్లు మంజూరు.. హర్షం వ్యక్తం చేసిన అనిల్ ముదిరాజ్

కల్వకుర్తి: ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ పథకం కింద 2026–27 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణకు 2 లక్షల ఇళ్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం హర్షణీయమని కల్వకుర్తి బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ పద్మ అనిల్ ముదిరాజ్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు లేని అర్హులైన పేద కుటుంబాలకు ఈ పథకం ద్వారా పక్కా ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం అందుతుందని తెలిపారు. తెలంగాణ ప్రజల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పేదల సొంతింటి కలను సాకారం…

రైతులను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం..

రైతులను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం..ఎండుతున్న పంట పొలాలు.. 18నెలలైనా ప్రాజెక్టు నింపలేదు..కనీసం 5 గంటల కరెంట్ కూడా సక్రమంగా ఇవ్వడం లేదు..నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 20 కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతుల కష్టాలు మరింత పెరిగాయని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆదివారం నార్కట్ పల్లి మండలం కొండపాకోనిగూడెం గ్రామంలోని బ్రాహ్మణ వెల్లెలం ప్రాజెక్టు దిగువన ఉన్న వంట పోలాలను పరిశీలించిన ఆయన…

కల్వకుర్తి కోర్టుకు రేపు మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి

కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ సాధన ఉద్యమ సమయంలో నాటి BRS ప్రభుత్వం అక్రమంగా నమోదు చేసిన కేసులో భాగంగా మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి గారు రేపు కల్వకుర్తి కోర్టుకు హాజరు కానున్నారు.రేపు ఉదయం 11 గంటలకు కల్వకుర్తి కోర్టులో ఆయన హాజరు కానున్నట్లు వెల్డండ యువజన కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు కడారి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్ చేయాలని జరిగిన ఉద్యమంలో పాల్గొన్న నాయకులపై అప్పటి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందని, ఆ…

పోతేపల్లి: NFBS చెక్కు అందజేత

వెల్దండ మండలం పోతేపల్లిలో ఇటీవల మృతి చెందిన ముంత శ్రీను కుటుంబానికి ప్రభుత్వం మంజూరు చేసిన జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (NFBS) కింద రూ.20 వేల చెక్కును గ్రామ సర్పంచ్ తగుల్ల కొండలు యాదవ్ అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులంతా సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, యువ నాయకులు ముంత మల్లేష్, ఉడుత శివ, చిన్న సైదయ్య, ఎగిరిశెట్టి శివ, ఉడుత బాలు, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.

తమ్ముడిని కత్తితో పొడిచి చంపిన అన్న

వరంగల్:16వ డివిజన్ పరిధిలోని గరీబ్ నగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. సొంత తమ్ముడిని అన్నే కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. గరీబ్ నగర్‌కు చెందిన ప్రవీణ్, ప్రసాద్ ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవ. ఆవేశానికి లోనైన అన్న ప్రవీణ్, తమ్ముడు ప్రసాద్‌పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా పొడిచాడు. తీవ్ర గాయాలపాలైన ప్రసాద్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడు ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ వేగవంతం…

డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో కారంగి బ్రహ్మయ్య భేటీ

నాగర్ కర్నూల్ : ఆర్‌ఎస్‌పీ ఫౌండేషన్ డైరెక్టర్ కారంగి బ్రహ్మయ్య డా. ఆర్‌ఎస్. ప్రవీణ్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రస్తుత సామాజిక, విద్యా, ప్రజా సమస్యలతో పాటు భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. యువత, విద్యార్థులు, మహిళలు, అణగారిన వర్గాల అభివృద్ధి, సామాజిక న్యాయంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సమష్టిగా కృషి చేయాలని నిర్ణయించారు.ఈ సమావేశంలో స్వేరోస్ జిల్లా నాయకులు పరామల ప్రకాష్, తోలు…

బాలాపూర్ గణనాధునికి వంశీచంద్ రెడ్డి దంపతుల ప్రత్యేక పూజలు

బాలాపూర్ గణనాథుడికి చల్లా వంశీచంద్‌రెడ్డి దంపతుల ప్రత్యేక పూజలుబాలాపూర్: బాలాపూర్ ప్రసిద్ధ గణనాథుడిని కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి, అశ్లేష రెడ్డి దంపతులు శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బడంగ్‌పేట్ మాజీ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి ఆహ్వానం మేరకు వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అభిషేకాలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, తెలంగాణ సుభిక్షంగా ఉండాలని స్వామివారిని…