ఆమనగల్ ఆరోగ్యానికి భరోసా – రూ. 17.50 కోట్లతో ఆధునిక ఆసుపత్రి నిర్మాణం
- రోడ్డు ప్రమాదంలో గోలి గోపాల్ రెడ్డి మృతి - September 20, 2026
- గణేష్ నిమజ్జన ఉత్సవాల్లో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.. డీఎస్పీ - September 20, 2026
- ఆమనగల్ ఆరోగ్యానికి భరోసా – రూ. 17.50 కోట్లతో ఆధునిక ఆసుపత్రి నిర్మాణం - September 20, 2026
ఆమనగల్: ఆమనగల్ పట్టణంలో రూ.17.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 50 పడకల ఆధునిక ప్రభుత్వ ఆసుపత్రి పనులను ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆసుపత్రి నిర్మాణ పురోగతి, నాణ్యత ప్రమాణాలు, వివిధ విభాగాల ఏర్పాట్లపై అధికారులను, కాంట్రాక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు.నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడొద్దని, పనులను వేగవంతంగా పూర్తి చేసి నిర్ణీత గడువులోగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్‌ను ఎమ్మెల్యే ఆదేశించారు. ఆసుపత్రి అందుబాటులోకి వస్తే ఆమనగల్‌తో పాటు పరిసర గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
