గణేష్ నిమజ్జన ఉత్సవాల్లో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.. డీఎస్పీ

కల్వకుర్తి: గణేష్ నిమజ్జన ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భక్తులు, నిర్వాహకులు నిబంధనలు పాటించాలని డీఎస్పీ సైరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. కల్వకుర్తి మండల పరిధిలోని సిలార్పల్లి గ్రామ సమీపంలోని ఈదుల చెరువును పుర కమిషనర్ మహ్మద్ షేక్‌తో కలిసి ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 23వ తేదీ మధ్యాహ్నం వరకు గణేష్ విగ్రహాలను ఈదుల చెరువులో నిమజ్జనం చేయాలని, ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.నిర్దేశించిన ప్రాంతాల నుంచి గణపయ్యలను తరలించి, తిరిగి యథావిధిగా సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని ప్రజలకు సూచించారు. ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు.1001197044.jpg

You may also like...