రైతులను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం..

రైతులను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం..1000352555.jpg

కాంగ్రేస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతుల కష్టాలు మరింత పెరిగాయని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆదివారం నార్కట్ పల్లి మండలం కొండపాకోనిగూడెం గ్రామంలోని బ్రాహ్మణ వెల్లెలం ప్రాజెక్టు దిగువన ఉన్న వంట పోలాలను పరిశీలించిన ఆయన రైతులతో నేరుగా మాట్లాడి విద్యుత్, సాగునీరు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు రైతులకు ఎన్నోహామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీలను అమలు చేయడాన్ని పక్కన పెట్టిందని ఆరోపించారు. వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ సక్రమంగా అందక రైతులు వంటలను కాపాడుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రోజుకు 12 గంటల విద్యుత్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కనీసం 5గంటల కూడా సక్రమంగా విద్యుత్ ఇవ్వని దుస్థితికి చేసిందన్నారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితిలో రైతులు సాగు చేయాల్సి వస్తోందన్నారు. సాగునీరు అందక పంటలు ఎండిపోతుంటే ప్రభుత్వ మాత్రం రైతుల సమస్యలపై దృష్టి పెట్టడం లేదని మండిపడ్డారు. ఉదయసముద్రం బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు విషయంలోనూ కాంగ్రెస్ తీరుపై ఆయన తీవ్రవిమర్శలు చేశారు. గత బీఆర్ఎ ఎస్ ప్రభుత్వ హయంలో నిధులు కేటాయించి పనులు పూర్తి చేసి ట్రయల్ రన్ నిర్వహించిన ప్రాజెక్టులకు ఇప్పుడు కొత్తగా రిబ్బన్ కటింగ్ లు చేయడం తప్ప రైతులకు సాగునీరు అందించే చిత్తశుద్ది ప్రభుత్వానికి లేదన్నారు. ప్రాజెక్టును ప్రారంభించి 18 నెలలు దాటినా ప్రాజెక్టులో పూర్తిస్తాయిలో నీళ్లు నింపలేదని విమర్శించారు. నీరు లేక పంట పోలాలు ఎండిపోతుంటే ప్రభుత్వం మాత్రం ప్రచార కార్యక్రమాలతో కాలం వెళ్లదీస్తోందని ఆరోపించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలు, విమర్శలు పక్కనపెట్టి రైతుల సమస్యలను పష్కరించాలని హితవుపలికారు. ప్రజలకు రైతులకు ఇచ్చిన 420 హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు సక్రమంగా విద్యుత్, సాగునీరు అందించిన పంటలను కాపాడే చర్యలు చేపట్టాలని కోరారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.

You may also like...