తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం రెండు లక్షల ఇల్లు మంజూరు.. హర్షం వ్యక్తం చేసిన అనిల్ ముదిరాజ్

1001197074.jpg

కల్వకుర్తి: ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ పథకం కింద 2026–27 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణకు 2 లక్షల ఇళ్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం హర్షణీయమని కల్వకుర్తి బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ పద్మ అనిల్ ముదిరాజ్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు లేని అర్హులైన పేద కుటుంబాలకు ఈ పథకం ద్వారా పక్కా ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం అందుతుందని తెలిపారు. తెలంగాణ ప్రజల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పేదల సొంతింటి కలను సాకారం చేయడంలో కీలకమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.

You may also like...