Monthly Archive: September 2026

డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో కారంగి బ్రహ్మయ్య భేటీ

నాగర్ కర్నూల్ : ఆర్‌ఎస్‌పీ ఫౌండేషన్ డైరెక్టర్ కారంగి బ్రహ్మయ్య డా. ఆర్‌ఎస్. ప్రవీణ్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రస్తుత సామాజిక, విద్యా, ప్రజా సమస్యలతో పాటు భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. యువత, విద్యార్థులు, మహిళలు, అణగారిన వర్గాల అభివృద్ధి, సామాజిక న్యాయంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సమష్టిగా కృషి చేయాలని నిర్ణయించారు.ఈ సమావేశంలో స్వేరోస్ జిల్లా నాయకులు పరామల ప్రకాష్, తోలు…

బాలాపూర్ గణనాధునికి వంశీచంద్ రెడ్డి దంపతుల ప్రత్యేక పూజలు

బాలాపూర్ గణనాథుడికి చల్లా వంశీచంద్‌రెడ్డి దంపతుల ప్రత్యేక పూజలుబాలాపూర్: బాలాపూర్ ప్రసిద్ధ గణనాథుడిని కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి, అశ్లేష రెడ్డి దంపతులు శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బడంగ్‌పేట్ మాజీ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి ఆహ్వానం మేరకు వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అభిషేకాలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, తెలంగాణ సుభిక్షంగా ఉండాలని స్వామివారిని…

శ్రీ మేరాడమ్మ యాడి ఆలయ నిర్మాణానికి భాస్కరరావు రూ.25 వేల విరాళం

శ్రీ మేరామయడి మందిర నిర్మాణానికి రూ.51 వేల విరాళంవెల్దండ: మండలంలోని నగరగడ్డ తండాలో శ్రీ మేరామయడి నూతన మందిర నిర్మాణానికి వెల్దండ సింగిల్‌ విండో చైర్మన్‌ జూపల్లి భాస్కర్‌రావు రూ.51 వేల విరాళం అందజేశారు. ఆలయ నిర్మాణ వివరాలను తండా నాయకులను అడిగి తెలుసుకున్న ఆయన, తన వంతు సహాయంగా నగదును అందించారు. ఆలయ అభివృద్ధికి సహకరించడం సంతోషంగా ఉందని, అమ్మవారి ఆశీస్సులు తండా ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని జూపల్లి భాస్కర్‌రావు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తండా…

బీరం హర్షవర్ధన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన పైలెట్ రోహిత్ రెడ్డి

పితృవియోగంతో దుఃఖంలో ఉన్న బీరం హర్షవర్ధన్ రెడ్డిని పరామర్శించిన పైలెట్ రోహిత్ రెడ్డికొల్లాపూర్: సింగోటలో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి నివాసానికి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వెళ్లి పరామర్శించారు. ఇటీవల మృతి చెందిన బీరం హర్షవర్ధన్ రెడ్డి తండ్రి బీరం లక్ష్మారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ భరోసా – గోలి శ్రీనివాస్ రెడ్డి

కల్వకుర్తి: కల్వకుర్తి నియోజకవర్గం మాడ్గుల మండలం ఫిరోజ్‌నగర్ గ్రామానికి చెందిన కలకొండ జ్యోతి కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ.44 వేల చెక్కును తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులకు అందజేశారు. పేదల ఆరోగ్య అవసరాలకు సీఎం రిలీఫ్ ఫండ్ సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో మాడ్గుల మండల బీఆర్‌ఎస్ అధ్యక్షులు జైపాల్ రెడ్డి, ఫిరోజ్‌నగర్ సర్పంచ్ కలకొండ జంగమ్మ శ్రీను,…

మేరాముడి మందిర నిర్మాణానికి విరాళం ఇచ్చిన సింగిల్ విండో చైర్మన్

వెల్దండ మండలం నగరగడ్డ తండాలో శ్రీ మేరాముడి నూతన మందిర నిర్మాణానికి వెల్దండ సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కర్ రావు రూ. 51,000 విరాళం అందజేశారు.ఆలయ నిర్మాణ వివరాలను తండా నాయకులను అడిగి తెలుసుకున్న ఆయన, తన వంతుగా ఈ విరాళాన్ని అందించారు. ఆలయ అభివృద్ధికి సహాయం చేయడం సంతోషంగా ఉందని, అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని ఆయన అన్నారు. తండా నాయకులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

కళ్ళకు చూపు.. జీవితాలకు వెలుగు – సుంకరెడ్డి సేవకు ప్రశంసలు

కడ్తాల్: పేదలకు ఉచిత కంటి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సహకారంతో నిర్వహిస్తున్న కంటి వైద్య శిబిరాల్లో భాగంగా కడ్తాల్‌లో 6వ మెగా ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతంగా ముగిసింది.ఆరు మండలాల్లో నిర్వహించిన శిబిరాల్లో ఇప్పటివరకు 19,791 మందికి కంటి పరీక్షలు, 15,497 మందికి ఉచిత కంటి అద్దాలు, 876 మందికి ఉచిత కంటి శస్త్రచికిత్సలు నిర్వహించారు. కడ్తాల్…

వెల్దండకు సరికొత్త బజాజ్ పల్సర్ బైక్ – రిబ్బన్ కట్ చేసిన సర్పంచ్

వెల్దండకు సరికొత్త బజాజ్ పల్సర్ బైక్.. రిబ్బన్ కట్ చేసిన సర్పంచ్వెల్దండ, సెప్టెంబర్ 19: పల్లె పల్లెకు పల్సర్ బండి కార్యక్రమంలో భాగంగా వెల్దండ మండల కేంద్రంలో సరికొత్తగా మార్కెట్లోకి వచ్చిన బజాజ్ పల్సర్ బైక్‌ను శనివారం ఆవిష్కరించారు. బజాజ్ షోరూం నిర్వాహకులు జగన్ గౌడ్, పర్యవేక్షకులు రాఘవేందర్ గౌడ్ ఆహ్వానం మేరకు గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి బైక్‌ను ప్రారంభించారు. సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రజల్లో అత్యంత…

బొల్లంపల్లిలో చేయూత పెన్షన్ల పరిశీలన – అర్హులందరికీ పెన్షన్ అందేలా చర్యలు

వెల్దండ, సెప్టెంబర్ 19: వెల్దండ మండలం బొల్లంపల్లి గ్రామపంచాయతీలో గ్రామ సర్పంచ్ సత్తూరి ప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో చేయూత పెన్షన్ల వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్, ఇరిగేషన్ ఏఈ మాల్యా నాయక్ పాల్గొని నూతన చేయూత పెన్షన్ల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు.అర్హత కలిగిన లబ్ధిదారులందరికీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి అన్నపూర్ణ, వార్డు సభ్యులు ధన్సింగ్…

సాయి నగర్‌లో భక్తిశ్రద్ధలతో గణనాథుడి పూజలు

శంకర్ పల్లి,సెప్టెంబర్ 19: శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని సాయి నగర్ కాలనీలో యువ గణేష్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. వినాయకుడి మండపం వద్ద ప్రతిరోజూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తులు గణనాథుడిని కొలుస్తున్నారు. కాలనీలోని ప్రతి కుటుంబం ఉత్సవాల్లో భాగస్వామ్యం అవుతూ గణపతి సేవలో తమ వంతు పాత్ర పోషిస్తోంది. ఉదయం నుంచి రాత్రి వరకు మండపం పరిసరాలు భక్తులతో సందడిగా మారుతున్నాయి. గణనాథుడి నామస్మరణతో సాయి నగర్…