పండుగ వేళ పారిశుద్ధ్య కార్మికులకు ఘన గౌరవం

390103.jpg

హైదర్షాకోట్: దీపావళి పండుగను పురస్కరించుకొని రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్ 123 డివిజన్ హైదర్షాకోట్‌లో పారిశుద్ధ్య కార్మికులకు ప్రకాషన్న దీపావళి కానుకగా దుస్తులు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి డివిజన్ అధ్యక్షులు పూలపల్లి కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్మికులకు కానుకలను అందజేశారు.

ఈ సందర్భంగా నల్లగొప్పుల హరీష్ గౌడ్ మాట్లాడుతూ… సమాజ ఆరోగ్యం, పరిశుభ్రత కోసం ఎండనక, వాననక అహర్నిశలు శ్రమించే పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. వారి శ్రమను గుర్తించి, పండుగ వేళ వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే సదుద్దేశంతోనే ఈ కానుకలను అందించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం పారిశుద్ధ్య కార్మికుల ముఖాల్లో చిరునవ్వులు పూయించింది.

You may also like...