తలకొండపల్లి లో గంజాయి పట్టివేత.. ఒకరి అరెస్టు
- తలకొండపల్లి లో గంజాయి పట్టివేత.. ఒకరి అరెస్టు - September 5, 2026
- మాజీ గవర్నర్ సుశీల్ కుమార్ షిండేతో శ్రీనివాస్ గౌడ్ - September 5, 2026
- ఆపదలో ఉన్న నిరుపేదలకు సీఎం సహాయనిధి వరం - September 1, 2026
కల్వకుర్తి సెప్టెంబర్ 04: తలకొండపల్లి బస్టాండ్ వద్ద గంజాయి సరఫరా చేస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు తలకొండపల్లి ఎస్సై కె. శేఖర్ మరియు పోలీసు సిబ్బంది తనిఖీలు నిర్వహించి విచారించగా అతని వద్ద 1 కిలో 245 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై శేఖర్ తెలిపారు. హైదరాబాద్ మంగళ్‌హాట్‌కు చెందిన రాజన్ సింగ్ (47) గా గుర్తించి అతని వద్ద నుండి 1 కిలో 245 గ్రాముల గంజాయిని మరియు సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకొని అతనిపై కేసు నమోదు చేయడం జరిగిందని ఇన్‌స్పెక్టర్ తెలిపారు. విచారణలో దూల్‌పేట్‌కు చెందిన అంగోరి భాయ్ వద్ద గంజాయి కొనుగోలు చేసినట్లు రాజన్ సింగ్ తెలిపాడు. తనిఖీల్లో హెడ్ కానిస్టేబుల్ హిమమంత రావు, కానిస్టేబుల్స్ బి. జాషువా, రమేష్,కురుమయ్య, భాను ప్రకాష్, సంజీవరెడ్డిలు ఉన్నారు.
