ఉపాధ్యాయుల అభిప్రాయాలకు తలొగ్గిన ఎంఈఓ.. రేపటి సమావేశం 4 గంటలకు పొడిగింపు
- మరికొద్ది క్షణాల్లో టంగుటూరుకు మందకృష్ణ మాదిగ - October 15, 2026
- దేవుల నాయక్‌కు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడి జన్మదిన శుభాకాంక్షలు - October 12, 2026
- పెళ్లి హామీతో లైంగిక వేధింపుల ఆరోపణ.. డీఐ బాలస్వామి అరెస్ట్! - October 11, 2026

- యథావిధిగా సమావేశం నిర్వహణకు నిర్ణయం
- అందరూ ఉపాధ్యాయులు హాజరు కావాలని ఎంఈఓ స్పష్టీకరణ
- ఉపాధ్యాయుల ఆలోచనలను పరిగణనలోకి తీసుకున్నట్లు వెల్లడి
జ్ఞాన తెలంగాణ, శంకర్పల్లి ప్రతినిధి, అక్టోబర్ 04:
శంకర్పల్లి మండలంలో రేపు నిర్వహించనున్న ఉపాధ్యాయుల సమావేశంపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. ఉపాధ్యాయుల అభిప్రాయాలు, ఆలోచనలను పరిగణనలోకి తీసుకున్నామని పేర్కొన్న ఎంఈఓ, సమావేశ సమయాన్ని మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 4 గంటలకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సమావేశం యథావిధిగా జరుగుతుందని, మండలంలోని అందరూ ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరు కావాలని స్పష్టం చేసినట్లు సమాచారం.
SA-1 పరీక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో సమావేశ సమయంపై పలువురు ఉపాధ్యాయులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడంతో ఈ అంశంపై చర్చకు దారితీసింది. ఉపాధ్యాయుల ఆలోచనలను దృష్టిలో పెట్టుకుని సమయాన్ని మార్చినట్లు ఎంఈఓ వెల్లడించారు.
అయితే సమావేశం నిర్వహణకు సంబంధించి గతంలో వెలువడిన ఆదేశాలు, అనంతరం వచ్చిన వివరణలతో ఉపాధ్యాయుల్లో ఏర్పడిన గందరగోళానికి ఇప్పుడు ఎంఈఓ స్పష్టత ఇచ్చారు. పరీక్షల నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలగకుండా సమయాన్ని సర్దుబాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
రేపటి సమావేశానికి అందరూ ఉపాధ్యాయులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంఈఓ కోరారు. ఉపాధ్యాయుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్న నేపథ్యంలో, రేపటి సమావేశం ప్రశాంతంగా జరుగుతుందా? పరీక్షల నిర్వహణతో సమన్వయం ఎలా ఉంటుంది? అన్నది చూడాల్సి ఉంది.
