వినయ్ కుటుంబానికి బీఆర్ఎస్ నాయకుల రూ.20 వేల ఆర్థిక సాయం
- ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే కసిరెడ్డి - October 22, 2026
- వినయ్ కుటుంబానికి బీఆర్ఎస్ నాయకుల రూ.20 వేల ఆర్థిక సాయం - October 22, 2026
- బుద్ధుని బోధనలపై అవగాహన.. వేలంలో బుద్ధుని ప్రతిమను సొంతం చేసుకున్న..ప్రవీణ్ పోలె - October 22, 2026

వెల్దండ:నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన గుమ్మకొండ వినయ్ కుమార్ అనారోగ్యంతో బుధవారం ఉదయం మృతి చెందాడు.ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.20 వేల ఆర్థిక సాయం అందించారు.కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్ రూ.5,000, తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి రూ.5,000, కల్వకుర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం రూ.5,000, జిల్లెల్ల మాజీ సర్పంచ్ ఎముక జంగయ్య రూ.2,000, మాజీ ఉపసర్పంచ్ పాండు గౌడ్ రూ.2,500,మాజీ వార్డు సభ్యుడు చిక్కొండ ఆంజనేయులు రూ.500 చొప్పున మొత్తం రూ.20,000 బాధిత కుటుంబానికి అందజేశారు.ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, కష్టకాలంలో అండగా ఉంటామని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు ముత్యాల నరేష్,చిక్కొండ పద్మ, ఆంజనేయులు,బీఆర్ఎస్ నాయకులు ముత్యాల రమేష్, గుమ్మకొండ రమేష్,కుమ్మరి ఆంజనేయులు,ఎముక యాదయ్య,శ్రీను,కుమ్మరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
