కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య.. బ్రహ్మణపల్లిలో విషాదం

తాడ్వాయి: మండలంలోని బ్రహ్మణపల్లి గ్రామంలో కుటుంబ కలహాల నేపథ్యంలో కొత్త లావణ్య (42) అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. సంతానం లేకపోవడంతో రాజమల్లయ్య దంపతులు 12 ఏళ్ల క్రితం రాజును దత్తత తీసుకున్నారు. రాజు రెండేళ్లుగా ఉపాధి నిమిత్తం దుబాయ్‌లో ఉంటున్నాడు. ఈ క్రమంలో రాజు భార్య లావణ్యకు కుటుంబ సభ్యులతో తరచూ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. గురువారం రాత్రి కూడా గొడవ జరగగా కుటుంబ సభ్యులు నచ్చజెప్పారు. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో లావణ్య ఉరివేసుకుంది. సీసీ కెమెరాల ద్వారా విషయం తెలుసుకున్న రాజు సమాచారంతో పొరుగువారు ఇంటికి చేరుకొని తలుపులు పగలగొట్టి చూడగా ఆమె మృతి చెంది కనిపించింది. కుటుంబ కలహాలు, మానసిక ఆవేదనే కారణమై ఉండవచ్చని ఫిర్యాదు అందడంతో తాడ్వాయి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

You may also like...