చీటకోడూర్ రామలింగేశ్వర ఆలయంలో సినిమా షూటింగ్ ప్రారంభం

WhatsApp Image 2026-11-14 at 19.17.40.jpeg

జనగామ ప్రాంతానికి చెందిన యువకులు నిర్మిస్తున్న నూతన సినిమా షూటింగ్ చీటకోడూర్ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ ఎమ్మెల్యే సీహెచ్ రాజారెడ్డి, జనగామ మున్సిపల్ మూడో వార్డు కౌన్సిలర్ బూడిద జ్యోతి క్లాప్ కొట్టి షూటింగ్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు చాగంటి టింకు జితేందర్ మాట్లాడుతూ.. 1990వ దశకంలో జనగామ ప్రాంతంలో నెలకొన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు, ప్రజల జీవన విధానం, అప్పటి ప్రజా సమస్యలు, వాటి పరిష్కారం కోసం సాగిన పోరాటాలు, యువత పాత్ర, కుటుంబ సంబంధాలు, త్యాగాలు, అవినీతికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల నేపథ్యంలో కల్పిత అంశాలను జోడించి చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు.మాజీ ఎమ్మెల్యే రాజారెడ్డి, కౌన్సిలర్ బూడిద జ్యోతి మాట్లాడుతూ.. జనగామ ప్రాంత చరిత్ర, సామాజిక ఉద్యమాలు, పోరాట స్ఫూర్తిని ప్రతిబింబించేలా స్థానిక యువకులు సినిమా నిర్మాణానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, పోరాట యోధులకు జనగామ నిలయమని పేర్కొన్నారు. చిత్ర నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించి సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు బూడిద గోపి, సీనియర్ రిపోర్టర్ తిప్పారపు ఉపేందర్, డైలాగ్ రైటర్ ఉప్పునూతల మధు, నటుడు, అసిస్టెంట్ డైరెక్టర్ మధు కన్నా, డీఓపీ క్రాంతి నీల, నటుడు జగన్, రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి ఎలుకట్టే జగన్నాథం, రంగు రాజశేఖర్, పాత్రికేయులు రాజు, గోపగోని వినయ్, జర్రిపోతుల పరశురాం తదితరులు పాల్గొన్నారు.

You may also like...