సమయస్ఫూర్తితో హెచ్‌సీయూ విద్యార్థి ప్రాణాలు కాపాడిన గచ్చిబౌలి పోలీసులు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) విద్యార్థి ప్రాణాలను గచ్చిబౌలి పోలీసులు సమయస్ఫూర్తితో స్పందించి కాపాడారు. నవంబర్ 27న డయల్-100కు విద్యార్థి సూసైడ్ నోట్ రాసి కనిపించడం లేదని అతని స్నేహితుడు సమాచారం అందించాడు. వెంటనే అప్రమత్తమైన గచ్చిబౌలి పోలీస్ పెట్రోలింగ్ సిబ్బంది యూనివర్సిటీలోని ఎల్ మెన్ హాస్టల్‌కు చేరుకున్నారు. అక్కడ మూడో అంతస్తు నుంచి దూకేందుకు ప్రయత్నిస్తున్న 21 ఏళ్ల విద్యార్థిని గుర్తించి సకాలంలో రక్షించారు. తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్న విద్యార్థిని యూనివర్సిటీ వెల్ఫేర్ టీమ్‌కు…
