డయల్–100 సేవల దుర్వినియోగం.. వ్యక్తికి జైలు శిక్ష
కీసర: డయల్–100కు తప్పుడు సమాచారం అందించి పోలీసు సేవలను దుర్వినియోగం చేసిన వ్యక్తికి న్యాయస్థానం మూడు రోజుల జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా విధించింది. ఈ నెల 24న కీసర పోలీస్స్టేషన్ పరిధిలో హత్య జరుగుతోందంటూ కొమ్ముల వెంకటేష్ (31) తప్పుడు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మూడు గంటల పాటు విచారణ చేపట్టగా ఎలాంటి ఘటన జరగలేదని తేలింది. మద్యం మత్తులో ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చినట్లు గుర్తించిన పోలీసులు…
