నేడు బీజేపీ రాష్ట్ర పదాధికారుల కీలక భేటీ

జ్ఞానతెలంగాణ,వెబ్ డెస్క్: తెలంగాణ బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం నేడు జరగనుంది. రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అధ్యక్షతన నిర్వహించనున్న ఈ సమావేశానికి ఉదయం 11 గంటలకు ముఖ్యఅతిథిగా అభయ్ పాటిల్ హాజరుకానున్నారు. పార్టీ రాష్ట్ర పదాధికారులు, ముఖ్య నేతలు సమావేశంలో పాల్గొననున్నారు.

తాజా రాజకీయ పరిణామాలు, రాష్ట్రంలో పార్టీ భవిష్యత్‌ కార్యాచరణపై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ముఖ్యంగా రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహంపై నేతలు సమాలోచనలు చేయనున్నారు.

అలాగే ఖైరతాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో పార్టీ విస్తరణ, క్షేత్రస్థాయిలో శ్రేణుల సమన్వయం, రాబోయే రాజకీయ కార్యక్రమాలపై కూడా సమావేశంలో నిర్ణయాలు తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

You may also like...