Category: తాజా వార్తలు

బ్యాంక్ ఉద్యోగుల మూడు రోజుల సమ్మె వాయిదా

జ్ఞాన తెలంగాణ, సెప్టెంబర్ 28: సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా చేపట్టాలని నిర్ణయించిన బ్యాంకు ఉద్యోగుల మూడు రోజుల సమ్మె వాయిదా పడింది. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ఆధ్వర్యంలో సమ్మెకు పిలుపునివ్వగా, ఆదివారం UFBU ప్రతినిధులు, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్...

రాత్రి అన్నం మానేస్తేనే బరువు తగ్గుతారా?

బరువు తగ్గాలని నిర్ణయించుకున్న వెంటనే చాలామంది ముందుగా రాత్రి అన్నాన్ని పూర్తిగా మానేయాలని భావిస్తుంటారు. రాత్రివేళ అన్నం తింటే అది కొవ్వుగా మారి బరువు పెరుగుతుందని అనుకోవడం సాధారణం. అయితే పోషకాహార నిపుణుల సూచనల ప్రకారం రాత్రి అన్నం తినడం ఒక్కటే బరువు పెరగడానికి కారణం కాదు....

కాచిగూడలో 14 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 26: కాచిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 14 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై బాలుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసులో నిందితురాలిగా పేర్కొన్న ట్రాన్స్‌జెండర్‌ అవంతికను పోలీసులు అరెస్టు...

నిమజ్జన ఊరేగింపులో రౌడీయిజం.. కానిస్టేబుల్‌పై కత్తితో దాడి

వికారాబాద్ జిల్లా, సెప్టెంబర్ 26: పరిగిలో వినాయక నిమజ్జన ఊరేగింపు సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెండు గ్రూపుల మధ్య తలెత్తిన గొడవను అదుపు చేసేందుకు వెళ్లిన కానిస్టేబుల్‌ నర్సింహులుపై ఓ యువకుడు విచక్షణారహితంగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఒక్కసారిగా జరిగిన దాడితో అక్కడున్న భక్తులు, పోలీసులు తీవ్ర...

కీసర ఓఆర్ఆర్పై రక్తపుటేర్లు.. టైర్ పేలి ఆటో బోల్తా

మేడ్చల్ జిల్లా, సెప్టెంబర్ 26: కీసర వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం విషాదం నింపింది. కీసర నుంచి శామీర్పేట్ వైపు కూలీలతో వెళ్తున్న ఆటో టైర్ ఒక్కసారిగా పేలడంతో అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా,...

ఐక్యత చాటిన తెలంగాణ.. ప్రశాంతంగా గణేష్‌ నిమజ్జనాలు

హైదరాబాద్, సెప్టెంబర్ 26 (జ్ఞాన తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా గణేష్‌ నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని డీజీపీ సి.వి. ఆనంద్‌ తెలిపారు. తెలంగాణ ప్రజానీకం ఐక్యత, సంయమనం చాటుతూ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తోందని పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నిమజ్జన ఏర్పాట్లు, పోలీసు బందోబస్తు,...

చాకలి ఐలమ్మకు కేసీఆర్ ఘన నివాళి

హైదరాబాద్, సెప్టెంబర్ 26 (జ్ఞాన తెలంగాణ): చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆమెకు ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలిగా, బహుజన ఆత్మగౌరవ ప్రతీకగా ఐలమ్మ పోషించిన పాత్రను కేసీఆర్ స్మరించుకున్నారు. తెలంగాణ...

శంకర్‌పల్లిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

జ్ఞాన తెలంగాణ,శంకర్‌పల్లి ప్రతినిధి,సెప్టెంబర్‌ 26:శంకర్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రైల్వే స్టేషన్‌ క్వార్టర్స్‌ వైపు వెళ్లే దారి పక్కన గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన వెలుగుచూసింది. స్థానికులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి వయస్సు...

నర్సింగ్‌ విద్యార్థిని అనుమానాస్పద మృతి!

జ్ఞాన తెలంగాణ ప్రతినిధి, జూలూరుపాడు, సెప్టెంబర్‌ 25: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో నర్సింగ్‌ విద్యార్థిని ఇంద్రపల్లి హరిణి (18) అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. ఇంట్లోనే ఉన్న హరిణి.. తల్లి బయటకు వెళ్లి తిరిగి వచ్చే సమయానికి...

ఓటర్లపై నోటీసులు.. మహేశ్‌ గౌడ్‌ ఫైర్‌

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ వెబ్ డెస్క్ : ఓటర్ల జాబితా సవరణ పేరుతో అర్హులైన పౌరుల హక్కులను హరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్యానికి పునాది అయిన ఓటు హక్కుపైనే అనుమానపు నీడలు కమ్ముకునేలా వ్యవహరిస్తే అది సాధారణ పరిపాలనా ప్రక్రియ...