సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి : తాసిల్దార్ పుష్పలత, ఎంపీడీఓ అంజన్ రెడ్డి

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, ఆగస్టు 17 : ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని, వాటికి పరిష్కారం చూపేందుకే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తాసిల్దార్ పుష్పలత, ఎంపీడీవో అంజన్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిషత్‌ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన పలువురు ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కరించాలని కోరుతూ దరఖాస్తులు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడానికి ప్రజావాణి మంచి వేదికగా ఉపయోగించుకోవాలని సూచించారు. దరఖాస్తులపై అధికారులు నిర్లక్ష్యం వహించకుండా, నిర్ణీత సమయంలో పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రజావాణిలో మొత్తం ఆరు దరఖాస్తులు వచ్చాయని అందులో నాలుగు రెవిన్యూ, ఒకటి హౌసింగ్, ఒకటి మండల పంచాయతీ అధికారికి సంబంధించిన దరఖాస్తులని తెలిపారు. కార్యక్రమంలో మండల పరిషత్ కార్యాలయ పర్యవేక్షకులు భువనగిరి రమేష్, ఎంపీఓ స్వరూప రాణి, ఎంఈఓ అంబటి అంజయ్య, ఏవో గిరిప్రసాద్, ట్రాన్స్ కో ఏఈ హుస్సేన్, ఏపీఓ కడెం రామ్మోహన్, పశు వైద్యాధికారి రవి నాయక్, హౌసింగ్ ఏఈ బానోతు అరుణ, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

You may also like...